గుర్రపు చెరువులు వెంటనే బాగు చేయాలి: జనసేన డిమాండ్

అవనిగడ్డ నడి మధ్యలో ఉన్నటువంటి గుర్రపు చెరువు చుట్టూ తెగిపోయిఉన్న ఫెన్సింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున, చెరువు చుట్టూ కొంతమంది మందుబాబులు చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఆపే విధంగా చెరువు చుట్టూ వైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగింపు చేసి, చెరువు లోపల ఉన్నటువంటి వ్యర్ధాలను తొలగించి, చెరువును శుభ్రం చేసి, చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రమాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను, పాలకవర్గాన్ని కోరుతూ సోమవారం వినతి పత్రాన్ని పంచాయతి వారికి ఇవ్వటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందుబాబు, గుగులోతు కిరణ్ నాయక్, భోగాది రాజ్యలక్ష్మి, టౌన్ ప్రధాన కార్య దర్శిలు అన్నపురెడ్డి ఏసుబాబు, షేక్ పరిద్ బాబా, అద్దంకి ధనుంజయ్ పార్టీ కార్యకర్తలు హాజరు కావడం జరిగింది.