వివాహానికి ఎన్నారై ఆర్థిక సాయం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరుకు చెందిన నాగమణి వివాహానికి ఎన్నారై ఆర్థికసాయం అందించారు. పేద కుటుంబానికి చెందిన నాగమణి వివాహ నిమిత్తం నెదర్లాండ్ లో ఉద్యోగరీత్యా స్థిరపడిన ఆలమూరు మండలం, గాంధీనగర్ చెందిన ఎన్నారై యర్రంశెట్టి రవికృష్ణ ఆర్థికసాయం అందించారు. ఈ మొత్తాన్ని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ చేతుల మీదుగా గంగుల నాగమణికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తాళ్ల డేవిడ్, చల్లా వెంకటేశ్వరరావు, చల్లా బాబి, కట్టా రాజు, శిరిగినీడి పట్టాభి, పడమట గణేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *