రెడ్డి కంచేరు గ్రామంలో ఇంటి ఇంటికి జనసేన

నెల్లిమర్ల నియోజకవర్గం: భోగాపురం మండలం, రెడ్డి కంచేరు గ్రామంలో జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి జనసేన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భోగాపురం మండల జనసేన కోఆర్డినేటర్ పల్లా రాంబాబు, సిరుగుడి వెంకటేష్, సీరపు శివాజీ, బైరెడ్డి సురేష్, వాసుపల్లి రాము, సీరపు కాము నాయుడు మరియు రెడ్డి కంచేరు గ్రామ జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.