ఇంకెన్ని టీటీడీ ఆస్తులను ప్రభుత్వ కార్యాలయాలుగా మారుస్తారు..!!

కొత్త కార్యాలయాలు నిర్మించుకో లేనప్పుడు కొత్త జిల్లాలుగా విభజించడం ఎందుకు..?

టిటిడి ఆస్తులన్నిటినీ వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుంది జనసేన ఆగ్రహ వ్యక్తం..

తిరుపతి లో మెటర్నిటీ హాస్పిటల్ ను మున్సిపల్ కార్యాలయముగా మార్చనున్న వైసిపి ప్రభుత్వం ను, మున్సిపల్, టీటీడీ అధికారులను నిలదీస్తూ, తక్షణమే ఇటువంటి చర్యలను ఆపివేయాలని ఈ మెటర్నిటీ హాస్పిటల్కు ఎంతో పేరు ఉందని జిల్లా నలుమూలల నుంచి పేదవారు ఇక్కడికి వస్తారని వారికి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం పైన సంబంధిత అధికారుల పైన ఉందని జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

ఈ సందర్భంగా ఆకే పార్టీ సుభాషిని, రాజేష్ యాదవ్, బాబ్జి, సుమన్ బాబు, మునస్వామి, వనజమ్మ, పార్థు, అమృత, కీర్తన, లక్ష్మి, బలరాం, ఆనంద్, బాటసారి, మనోజ్, సాయిదేవ్, దిలీప్, హిమవంత్, రమేష్, మరియు రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులతో కలిసి తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఇంకెన్ని టీటీడీ ఆస్తులను ప్రభుత్వ కార్యాలయాలుగా మారుస్తారని, కొత్త కార్యాలయాలు నిర్మించుకో లేనప్పుడు కొత్త జిల్లాలుగా విభజించడం ఎందుకని, టిటిడి ఆస్తులన్నిటినీ వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని, రాయలసీమలోనే ఎంతో ప్రత్యేక పేరుగాంచిన హాస్పిటల్స్ లలో మెటర్నిటీ హాస్పిటల్ ఒకటని, తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా చిత్తూరు జిల్లా మరియు పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడకు పేషెంట్లు వస్తూ ఉంటారని అలాంటిది ఈ హాస్పిటల్లో పేషెంట్లు ఉండగానే తిరుపతి నగరపాలకసంస్థ అని బోర్డు పెట్టడం చాలా దారుణం అని తిరుపతిలో ఉన్న ప్రభుత్వ, ప్రజల ఆస్తులే కాకుండా టీటీడీ ఆస్తులను కూడా కాజేస్తున్నారు అనడానికి ఇదే ఒక ఉదాహరణ అని, ఈ హాస్పిటల్ ను ఇలానే కొనసాగించాలి ప్రభుత్వ కార్యాలయాలుగా మారిస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలతో సహా అంబులెన్స్ లకు, అత్యవసర చికిత్సలకు అంతరాయం కలుగుతుంది కాబట్టి, ఈ నిర్ణయాన్ని మార్చుకొని వేరొక చోటకు మున్సిపల్ కార్యాలయమును మార్చుకోవాలని, లేదు ఇక్కడే కొనసాగిస్తాము అన్నట్లయితే జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున నిరసన ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు.

అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ గతంలోను టీటీడీ కి సంబంధించిన అతిథి గృహములను ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చారని ఇలానే కొనసాగితే టిటిడి ఆస్తులు ఒక్కటి కూడా మిగలవని, హాస్పిటల్స్ సిబ్బందితో సహా స్థానిక ప్రజలు, పేషెంట్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని ఇలాంటి నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *