దేశంలో నే హైదరాబాద్‌కు రెండో ర్యాంక్‌…!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రియల్ బూమ్ గురించి ఎంత చెప్పుకున్నా చాలా చాలా తక్కువే. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా.. జహీరాబాద్ బైపాస్ లో నడుస్తోంది. అంటే జహీరాబాద్ టు హైదరాబాద్ మధ్యలో ఉన్న భూములు అన్నీ ఇప్పుడు అయిపోయాయి. ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొన్ని చిన్న చిన్న పల్లెలు మినహా యాదాద్రి భువనగి రి టు వరంగల్ వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ తన్నుకు వస్తోంది. అటు ముంబై హైవే చుట్టు పక్కన అసలు ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. ఓ వైపు కరోనా దెబ్బతో దేశంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా స్తబ్దుగా ఉన్నా కూడా హైదరాబాద్, దాని పరిసరాల్లో మాత్రం ఆకాశానికి ఎగబాకింది. ఇక ఇప్పుడు హైదరబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మన దేశంలోనే రెండో స్థానంలో ఉందంటే ఇక్కడ రేట్లు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ లిస్టులో ముంబై మొదటి స్థానంలో ఉంది. ముంబై మొదటి స్తానంలో ఉన్నా పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ముంబై గత మూడు దశాబ్దా లలో ఎప్పుడూ ఎలాంటి ఒడి దుడు కులు ఎదుర్కోలేదు. కానీ హైదరాబాద్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా డల్ అయ్యింది. మరో వైపు రాష్ట్ర విభజన జరిగింది. మరో వైపు అమరావతి రాజధాని అయ్యి .. చంద్రబాబు టైంలో అక్కడ రియల్ భూమ్ పుంజుకున్నప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాస్త డల్ అయ్యింది. అలాంటి ది ఇప్పుడు ఏపీ లో జగన్ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు కూడా హైద రాబాద్ కు కలిసి రావడంతో ఇక్కడ రియల్ భూమ్ ఫుల్ స్వింగ్‌లో దూసుకు పోతోంది. ఇంకా చెప్పాలంటే దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై ను దాటుకుని హైదరాబా ద్ ముందు కు వెళ్లడం గ్రేటే..!