హైదరాబాద్ ఘన విజయం

ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకుంది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై 150 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 17.1 ఓవర్లలోనే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (85 నాటౌట్:58 బంతుల్లో 10ఫోర్లు,సిక్స్‌), వృద్ధిమాన్‌ సాహా (58 నాటౌట్: 45 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో సన్‌రైజర్స్‌ వికెట్‌ కోల్పోకుండానే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరింది.

అంతకుముందు పొలార్డ్‌ మెరుపు ఇన్నింగ్స్‌లకు తోడు క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ , జేసన్‌ హోల్డర్‌, షాబాజ్‌ నదీం దెబ్బకు ముంబై భారీ స్కోరును సాధించలేక పోయింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవడంతో కోల్‌కతా ప్లేఆఫ్‌ అవకాశాన్ని దక్కించుకుంది.