మంత్రి పదవి పోయిన పేర్ని నానికి మతిభ్రమించింది

పెడన, వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి పేర్ని కి గాని, తన తనయుడు కి టిక్కెట్ రాదని రాజకీయ వర్గాల్లో భోగట్టా. సొంత పార్టీలోనే ఎవరితో పెట్టుకోకూడదో వారితో పెట్టుకుని పరువు పోగొట్టుకున్న పేర్ని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై లేనిపోని ఆరోపణలు చేసి తమ యజమాని దగ్గర మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేశాడు. ప్రసన్నం చేసుకోవడం, పాలేరుతనం చేయటం పేర్నికి కొత్త కాదనుకో, అధికారంలో లేనప్పుడు మచిలీపట్నానికి పోర్టు తెస్తానని దొంగ దీక్షలు చేసి ఎమ్మెల్యే అయ్యావు. తర్వాత మంత్రి అయ్యావు ఇప్పుడు మాజీ మంత్రి అయ్యావు. రాబోయే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అవుతావ్ అది భవిష్యత్తు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మచిలీపట్నానికి ఏం చేశావో సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీకు లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, మచిలీపట్నం పోర్టు గురించి బహిరంగ చర్చకు సిద్ధమా? కనీసం మచిలీపట్నం బస్టాండ్ కూడా బాగు చేయలేని బతుకులు మీవి, నీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. విరామం లేకుండా 365 రోజులు రాజకీయాలు చేసి మచిలీపట్నానికి నువ్వు ఊడపొడిచింది ఏమిటి? పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి ప్రెస్ మీట్ లు పెట్టడం తప్ప దేనికి పనికిరావు అని మచిలీపట్నం ప్రజలకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో నీలాంటి అజ్ఞానులకు తెలియాలంటే జనవాణి జనసేన భరోసాకి అర్జీ పట్టుకు రావాల్సింది. మీరు చేస్తున్న దుర్మార్గాలను ప్రజలు పవన్ కళ్యాణ్ కి వివరించడాని చూసి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ మీద లేనిపోని విమర్శలు చేస్తున్నావు. కన్నతల్లె మీ నాయకుడి మీద నమ్మకం లేక రాజీనామా చేసి తప్పుకుంది. తోబుట్టువు రాష్ట్రానికి విడిచి వెళ్ళిపోయింది. రేపు అధికారం పోతే విశ్వాసంలో కుక్కని, పెద్ద పాలేరుని అన నీలాంటి వాళ్లు కూడా పార్టీని వదిలి పారిపోతారు. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన లక్షలాదిమంది జనసైనికులు, కోట్లాదిమంది ప్రజలు విశ్వసిస్తున్నారు. అది నాయకత్వం అంటే, అదే క్రెడిబిలిటీ అంటే నువ్వు, నీ నాయకుడు, నీ పార్టీ 100 జన్మలెత్తిన పవన్ కళ్యాణ్ స్థాయికి చేరుకోలేరు. సంధి ప్రేలాపనలను కట్టిపెట్టి, నీ రాజకీయ భవిష్యత్తుపై దృష్టి పెట్టమని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.