భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఇచ్చాపురం జనసేన ఘన నివాళి

ఇచ్చాపురం మండలం, లొద్దపుట్టుగ గ్రామంలో స్థానిక జనసైనికులు నిర్మించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దాసరి రాజు సమక్షంలో లొద్దపుట్టుగ గ్రామపెద్ద జనసేన నాయకుడు తిప్పన దామోదర రెడ్డి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మున్సిపాలిటీ 10వ వార్డ్ ఇంచార్జ్ రోకళ్ళ భాస్కరరావు, జనసైనికులు తిప్పన రవి, శంకర్, దుర్యోధన, హరీష్, భాస్కర్, జైపాల్, వాసు తదితరులు పాల్గొన్నారు.