పవన్ కళ్యాణ్ కి ఏదైనా హాని జరిగితే దానికి పూర్తిబాధ్యత ప్రభుత్వానిదే రైల్వే కోడూరు జనసేన

రైల్వే కోడూరు, ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి జనసేన పార్టీ మీద వైసిపి దాడులు పెరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పరాజయం తప్పదని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న ఆ పార్టీ అధిష్టానం ఈ చర్యలకు పాల్పడుతోందని రైల్వే కోడూరు జనసేన వేదికగా తెలియజేస్తున్నాం. మొన్న వైజాగ్ పవన్ కళ్యాణ్ పర్యటనలో ఇబ్బంది పెట్టిన తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఆ రోజు నుండి ఇంకా దాడులు పెరుగుతూనే ఉన్నాయి. హైద్రాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కొంతమంది ఆగంతకులు రెండు మూడు రోజులుగా ఆయన కదలికలను గమనిస్తూ కళ్యాణ్ అనుచరగణాన్ని తీవ్ర పదజాలంతో తిడుతూ దాడికి యత్నించినట్లు పవన్ వ్యక్తిగత సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి జరగరానిది ఏది జరిగినా దానికి పూర్తి బాధ్యత ఈ జగన్మోహనరెడ్డి ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని రైల్వేకోడూరు జనసేన పార్టీ తరుపున హెచ్చరిస్తున్నామని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ప్రజాస్వామ్యాన్ని గుర్తుతెచ్చుకుని కవ్వింపు చర్యలకు దూరంగా ఉంటే మంచిదని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు జనసేన నాయకులు వర్ధన గారి ప్రసాద్, మర్రి రెడ్డిప్రసాద్, ముత్యాల కిశోర్, అ౦కిశెట్టి మణి, ఉత్తరాది శివకుమార్, యద్ధల అనంత రాయలు, సాయం శ్రీధర్, హరిబాబు, దశరధ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు .