తక్షణ సహాయక చర్యలు చేపట్టకపోతే ఆందోళన తప్పదు: అతికారి దినేష్

రాజంపేట, మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోకపోతే ఆందోళన తప్పదని మంగళవారం రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పాటూరు గ్రామంలో నేలమట్టమైన దాదాపు 120 ఎకరాల వరి పంట పరిశీలనలో రాజంపేట జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అతికారి దినేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తుఫాను వల్ల పెను ప్రమాదం పొంచి ఉన్నదని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ముందస్తు సహాయక చర్యలకు సిద్ధం కావాలని ముందస్తు మీటింగులు పెట్టి పెడుతున్నారు తప్ప ఆచరణలో సహాయక చర్యలు చేపట్టడం లేదన్నారు. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల వల్ల రోజువారి కూలీ చేసుకునే పేదలకు పూట గడవడమే కష్టంగా ఉన్నదని అలాంటి వారికి భోజనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో ఆరా కొరగా సాగు చేసిన చేతికొచ్చిన వరి పంట పూర్తిగా చేలోనే నేలకొరిగిందన్నారు. అక్కడక్కడ సాగుచేసిన మినుము, శనగ, ఉద్యాన పంటలు నేలబట్టమయ్యాయి అన్నారు. పత్తి పంట పాడైపోయిందన్నారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నప్పటికీ ఆచరణలో ఎక్కడ అందుబాటులో లేవని వరి కోత మిషన్లు యంత్రాలన్నీ వైసీపీ నేతల ఇళ్లలో ఉన్నాయని వారు ఆరోపించారు. యంత్రాల అందుబాటులో ఉంటే సగానికి పైగా పంట నూర్పిడి సకాలంలో చేసుకునే వారన్నారు. కనీసం దాన్యం కప్పుకోవడానికి పట్టలు సరఫరా కూడా ప్రభుత్వం నిలిపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మరియు ఏ ఒక్క అధికారులు ఇప్పటివరకు వరి పంటలను పరిశీలించి బాధితులకు భరోసా కల్పించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు తక్షణం ప్రభుత్వం దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసి పంటల భీమా పెట్టుబడి రాయితీ పరిహారాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం చెల్లించాలని, తక్షణం తుఫాన్ సహాయక చర్యలు చేపట్టాలని వారు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాటూరు గ్రామ రైతులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.