బాబు పాలూరు ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

  • మహాత్మగాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రిలకు ఘన నివాళులు

పార్వతీపురం, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా “నా సేన కోసం నా వంతు” కార్యక్రమాన్ని ఆదివారం పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండల కేంద్రంలో జనసైనికులతో నిర్వహించడం జరిగింది. అనంతరం “అహింసా మూర్తి” మహాత్మ గాంధీ విగ్రహానికి మరియు జై జవాన్ జై కిసాన్ అంటూ స్వాతంత్య్ర సమరంలో తనదైన శైలిలో పోరాటం చేసిన లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, మండల నాయకులు గంట్యేడ స్వామి నాయుడు, పరుచూరి రమణ, ఉంగరాల నాగేశ్వరరావు, అక్కుం నాయుడు, సంతోష్, గన్నెర వాసు, వంశీ, త్రినాథ్, గోవింద్, సత్యం నాయుడు మరియు జనసైనికులు పాల్గొన్నారు.