వచ్చే ఎన్నికల్లో రోజా గెలిస్తే గుండు గీయించుకుంటా.. కిరణ్ రాయల్ ఛాలెంజ్

  • వైసిపి మంత్రులకు కిరణ్ రాయల్ సవాల్..
  • రోజవ్వా రంగు తీసి బయటకు రా ప్రజలకు ని నిజస్వరూపం కనిపిస్తుంది..
  • నగిరిలో నువ్వు గెలిస్తే గుండు గీయించుకుంటా..
  • వైసిపి ప్రభుత్వం రాకపోతే రోజవ్వ నువ్వు గుండు గీయించుకుంటావా..
  • వారాహిని అడ్డుకోవాలని చూస్తే వైకాపా మంత్రులు మా వాహనం కింద నలిగిపోతారు..
  • సజ్జల నోరు అదుపులో పెట్టుకో రానున్నది జనసేన ప్రభుత్వమే..
  • నిస్వార్ధమైన మా జనసేనాని విమర్శిస్తే చూస్తూ ఊరుకోం..

తిరుపతి: జనసేనాని పర్యటన వారాహి వాహనంపై మంత్రి రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, అమరనాథ్ లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జనసేన నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ జనసేనాని నిస్వార్ధంగా ప్రజాసేవ చేయడానికి వారాహి వాహనంతో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి సిద్ధమైతే, వైకాపా మంత్రులు (కంత్రులు) సీఎం మెప్పు పొందడం కోసం తమ పవన్ కళ్యాణ్ ను విమర్శించడం పట్ల కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయన మాట్లాడుతూ.. మంత్రి రోజా జబర్దస్త్ స్క్రిప్ట్ లాగా జనసేనతో చాలెంజ్ విసరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.. 2024లో నగిరిలో మరోసారి రోజా గెలిచినా తాను రోజా ఇంటి ముందే గుండు గీయించుకోవడానికి సిద్ధమని, అదే రోజా విఫలమైనా, వైసిపి ప్రభుత్వం రాకపోయినా బోడి గుండు కొట్టుకోవడానికి సిద్ధమా అని కిరణ్ రాయల్ సవాల్ విసిరారు, మేకప్ తీసి రోజా అవ్వ బయటకు వస్తే రోజా డ్రైవరే అసహ్యించుకుంటారాని, నీ అవినీతి నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందన్నారు, భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవి ఉండదని, జబర్దస్త్ జడ్జి పాత్ర కూడా ఉండదంటూ, ఎందుకంటే రానున్నది జనసేన ప్రభుత్వమేనన్నారు.. కౌలు రైతులు 3000 మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున జనసేన అదినేత మా పవన్ కళ్యాణ్ సాయమందిస్తే, దానిని మంత్రి అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డిలు విమర్శించడం పట్ల నోరు అదుపులో పెట్టుకోవాలని వారిపై నిప్పులు చెరిగారు.. నిస్వార్ధమైన మా జనసేనాని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, ఇది మరోసారి రిపీట్ అయితే రాష్ట్రంలో ఎక్కడా వైకాపా వాచ్ డాగ్ లను తిరగనివ్వమని మంత్రులను హెచ్చరించారు. ఈ సమావేశంలో తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ , పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సుభాషిని, హేమ కుమార్, సుమన్ బాబు, రాజమోహన్, మునుస్వామి, సుమన్, హేమంత్, సాయి పాల్గొన్నారు.