లంచగొండి రాంబాబూ రాజీనామా చెయ్: బోనబోయిన, గాదె

గుంటూరు: అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా సత్తెనపల్లి నియోజకవర్గాన్నీ మార్చి ప్రజల సొమ్మును జగన్మోహన్ రెడ్డి తరహాలోనే అంబటి దోచుకుంటున్నాడని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ విమర్శించారు. మంగమ్మ దంపతులను ఆదుకోవాల్సిన మంత్రి తన అనుచరులను అడ్డుపెట్టుకొని బాధితుల సొమ్మును కూడా తీసుకుంటున్నారని ఇది సత్తెనపల్లి ప్రజల దౌర్బగ్యమని అన్నారు. కౌలురైతు భరోసా సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజనామా చేస్తానని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికాడని, ఇప్పుడు స్వయంగా బాధితులే ముందుకు వచ్చి చెప్తున్నారన్నారని, తక్షణమే అంబటి రాంబాబు మంత్రి పదవికి రిజైన్ చేయాలని గాదె డిమాండ్ చేశారు. సత్తెనపల్లికి చెందిన తురకా మంగమ్మ దంపతుల కుమారుడు ఓ రెస్టారెంట్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా తమ కొడుకు చనిపోయాడని ఇందుకు గాను ప్రభుత్వం నుంచి ఐదు లక్షల పరిహారం వచ్చిందని అయితే ఐదు లక్షల చెక్కు ఇవ్వాలంటే రూ.2.50 లక్షల లంచం ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ ఛైర్మన్ భర్త సాంబశివరావులు అడిగారని ఇది చాలా దుర్మార్గమని గాదె అన్నారు. తమ కొడుకు మృతితో వచ్చే డబ్బులతో తమ కుమార్తె పెళ్ళి చేసుకుందాం అనుకున్నామని తెలిపారు. అంబటి రాంబాబు లంచం విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆశ్రయించామని పవన్ వచ్చి వెళ్లిన నాటి నుంచి వైసీపీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. తమ కొడుకు మృతి పరిహారం చెక్కు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. తురకా మంగమ్మ దంపతులకు వెంటనే పరిహారం చెక్కు ఇవ్వాలి. సాయంత్రంలోపు ఇవ్వకపోతే ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తామని, అవవసరమైతే జనసేన పార్టీ నుండి ఆమరణ నిరహార దీక్షకు దిగుతామని రాష్టప్రదాన కార్యదర్శి బోనబోయిన హెచ్చరించారు. మంగమ్మ దంపతులకు ఏదైన హాని జరిగితే అంబటి రాంబాబు దే బాధ్యతని అన్నారు. మంగమ్మ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు గాదె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అమ్మిశెట్టి వాసు, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు నారదాసు ప్రసాద్, కొమ్మిశెట్టి సాంబశివరావు,కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మ, మధులాల్, దాసరి వెంకటేశ్వరరావు, నెల్లూరు రాజేష్, తుమ్మల నరసింహారావు,తన్నీరు గంగరాజు పాల్గొన్నారు.