సామాన్యుడే నాయకుడు అయితే తప్పకుండా రామరాజ్యం వస్తుంది: రేపాక నాగేశ్వరరావు

విశాఖపట్నం జిల్లా, గాజువాక నియోజకవర్గ జనసేన పార్టీ దమ్మున్న నాయకులు రేపాక నాగేశ్వరరావు(అఖండ దివ్యాస్త్రం నాగు)కి ముందుగా జనసేన పార్టీ తరుపున మరియు మన శతఘ్ని న్యూస్ పేపర్ తరుపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. రేపాక నాగేశ్వరరావు గత 15 సంవత్సరాల నుండి కూడా రాజకీయాల్లో అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. అయన గత 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి మళ్ళీ గత 2014 నుండి జనసేన పార్టీ ద్వారా ఒక దమ్మున్న నాయకుడిగా ఎదిగి ప్రజల్లోకి బలంగా వెళ్తూ అయన ఎన్నో పోరాటాలు చేస్తూ, మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తన వంతు చైతన్యం తెస్తున్నారు. అలాగే రేపాక నాగేశ్వరరావు నేటికీ 5 పుస్తకాలు రాయడం జరిగింది. ఈ సమాజ హితమే లక్ష్యంగా సగటు సామాన్యుడే నాయకుడిగా ఎదగాలి అని ఇంకా అవినీతి రాజకీయాల అంతం కోసం, మరీ ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థలో అవినీతిని అంతం చెయ్యడమే అంతిమ లక్ష్యంగా తానే ఒక ఆర్మీగా ఉంటూ తన సొంత డబ్బులు ఖర్చు చేసి 7 టీమ్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా తాను రాసిన 5 పుస్తకాలు కూడా తన సొంత డబ్బులు 1 కోటి రూపాయలు ఖర్చు చేసి 2 లక్షల పుస్తకాలుగా ముద్రణ చేసి ప్రజలకు ఉచితంగానే పంచి పెట్టడం జరుగుతుంది. ఇంకా ఒక వైపు జనసేన పార్టీని గత 10 సంవత్సరాల నుండి గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తూ కూడా మరో వైపు 1000 మంది అనాధ బిడ్డలకు ఆకలి తీర్చడంలో ఇంకా వారి చదువుల కోసం తన బ్రహ్మస్త్రం టీం నుండి 20 రకాల నాణ్యమైన వస్తువులు కొని వాటిని ఒక కిట్టుగా చేసి దానికి బ్రహ్మస్త్రం కిట్టు అంటూ నామకరణం చెయ్యడం కూడా జరిగింది. అందుకే ముందుగా ఈ 1000 మంది అనాధ బిడ్డలకు కూడా తన బ్రహ్మస్త్రం టీం నుండి ఈ బ్రహ్మస్త్రం కిట్లను ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా మీకు మరో విషయం చెప్పాలి. అదేమిటి అంటే సగటు సామాన్యుడే నాయకుడిగా ఎదగాలి అని రేపాక నాగేశ్వరరావు తన గాజువాక నియోజకవర్గం నుండి గత 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున తానే ఎమ్మెల్యేగా పోటీకి కూడా సిద్ధం అయ్యారు అంటే అయన ఏ స్థాయిలో రాజకీయాల కోసం పోరాటం చేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించగలరు. రానున్న ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇదే గాజువాక నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరుపున ఎమ్మెల్యేగా అవకాశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కల్పిస్తే. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి కనీసం 10,000 ఓట్లు రాబట్టుకొనే సత్తా ఉన్నవారికి మాత్రమే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పిస్తాను అంటూ అయన చెప్పడం కూడా జరిగింది. అయితే రేపాక నాగేశ్వరరావు ప్రతి విషయాలను కూడా మన శతఘ్ని న్యూస్ పేపర్ వారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. సగటు సామాన్యుడే నాయకుడిగా అవ్వాలి అనేదే జనసేన పార్టీ లక్ష్యం కూడా. అందుకే రేపాక నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు శాసన సభలోకి వెళితే మరింత బలంగా పోరాటాలు చేస్తూ సరికొత్త చట్టాలను తీసుకువచ్చేలా ప్రయోగాలు చేస్తారు. ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ సిద్ధాంతాలను దగ్గర ఉండి తానే తన పుస్తకాలు ద్వారా తెలియ చెప్పడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క విధంగా తన 7 టీమ్స్ నీ జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చెయ్యడానికి రేపాక నాగేశ్వరరావు ముందుకు తీసుకువెళ్తున్నారు. రానున్న రోజుల్లో భహిరంగ పోరాటాలు కూడా మరింత దూకుడుగా చెయ్యడానికి తన 7 టీమ్స్ నీ మరింతగా బలోపేతం చేస్తున్నారు. అలాగే ఓటు విలువను తెలియ చెప్పడంలో రేపాక నాగేశ్వరరావు ముందు వరుసలో ఎప్పుడు ఉంటారు. అలాగే అవినీతి రాజకీయాన్ని రేపాక నాగేశ్వరరావు అవినీతి రాజకీయాన్ని అంతం చెయ్యడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక పెద్ద మహా యుద్ధమే చేస్తున్నారు. గత 25 సంవత్సరాల నుండి ఇదే గాజువాక నియోజకవర్గంలో ఉంటూ కూడా అనేక సమష్యలు మీద తన పోరాటాన్ని చేస్తూ ఇంకా మన గాజువాకలో ఉన్న అన్ని అనాధ ఆశ్రమాలకు కూడా ఆర్ధికంగా ఇంకా వస్తు రూపేణా తన వంతు తాను సహాయ సేవా కార్యక్రమాలు అందిస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మన గాజువాక నియోజకవర్గం నుండి దాదాపుగా 99% పోటీ చెయ్యాలి అని ఒత్తిడి కూడా తీసుకువస్తున్నారు. మిగతా 1% మాలాంటి సగటు సామాన్యుడికి అవకాశం కల్పించేలా అయన తన రచనలు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియచెబుతున్నారు. అయితే రేపాక నాగేశ్వరరావుని 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తులతో వెళుతుందా లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తుందా అని మన శతఘ్ని న్యూస్ వారు అడగడం జరిగింది. అయన చెప్పే జవాబు చూస్తుంటే అయన జనసేన పార్టీ కోసం ఎంతగా పోరాటం చేస్తున్నారో అర్ధం అవుతుంది. మీ అందరికి అన్నయ్య పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలి అని ఉంది. కానీ రేపాక నాగేశ్వరరావుకి 2044 ఎన్నికల్లో అన్నయ్య పవన్ కళ్యాణ్ ను ప్రధానమంత్రిగా చూడాలి అని అన్నారు. రేపాక నాగేశ్వరరావు చిన్నప్పటి నుండి తినడానికి తిండి లేక ఎన్నో రోజులు ఆకలి భాధలు అనుభవించారు. అందుకే ఆయనకు ఆకలి బాధ అంతా బాగా తెలుసు. అలాగే తాను పెద్ద చదువులు చదవడానికి ఆర్ధిక ఇబ్బందులు అడ్డు రావడంతో బాల కార్మికుడిగా ఒక టీ కొట్టులో 150 రూపాయలు జీతానికి పనిచేశ్తూ తానే తన కుటుంబ బాధ్యత మోస్తూ చదువుకు దూరం అయ్యారు. అయితే బ్రతుకు తెరువు కోసం 1998 వ సంవత్సరంలో గాజువాక పట్టణానికి వచ్చిన అయన తాను ఒక్కొక్క రూపాయిని సంపాదిస్తూ సంపాదిస్తూ పేద పిల్లల చదువుల కోసం కొంత ఖర్చు చేస్తూ ఆనాడే సేవా కార్యక్రమాలకు పునాది వేశారు. అయితే గత 2014 నుండి బహిరంగ సేవా కార్యక్రమాలలో అయన పాల్గొనడం జరిగింది. ఇంకా 2019 లో కరోనా సమయంలో ఏ ఒక్కరు కూడా బయటికి రాని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా తన ప్రాణాలకు తెగించి గాజువాకలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్క కరోనా సమయంలోనే అయన తన సొంత డబ్బులు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి అనాధ బిడ్డల ఆకలి తీర్చారు. దాదాపుగా ఆనాడే 300 మంది అనాధ బిడ్డలకు దేవుడు అయ్యారు. ఇలా రేపాక నాగేశ్వరరావు గురించి తెలుసుకుంటూ ఉంటే మరెన్నో విషయాలు బయటికి వస్తూనే ఉంటాయి. సగటు సామాన్యుడే నాయకుడు అయితే తప్పకుండా రామ రాజ్యం వస్తుంది అని రేపాక నాగేశ్వరరావు భావిస్తూ ఉంటారు. అందుకే అయన మన జనసేన పార్టీలో నేటి యువతకు ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా తన 7 టీమ్స్ ద్వారా తన వంతు కృషి తాను చేస్తూనే ఉంటారు. అనాడు మన జనసేన పార్టీ విశాఖపట్నంలో మొదలు పెట్టిన కవాతు నుండి నిన్నటి మన జనసేన పార్టీ వారాహి విజయ యాత్ర వరకు కూడా అయన 90% అన్ని కార్యక్రమలులో పాల్గొనడం జరిగింది అంటే జనసేన పార్టీని ఏ స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి అయన, అయన కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారో అర్ధం చేసుకోండి. ఇంకా తన 7 టీమ్స్ ఒక్క కేలండర్స్ ని 15,000 ముద్రణ చేసి తన గాజువాక నియోజకవర్గ ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే గత 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ మేనిఫెస్టోలు 10,000 ముద్రణ చేసి గాజువాక ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా అయన అనేక విషయాలు మన శతఘ్ని న్యూస్ పేపర్ వారికి చెప్పడం జరిగింది. అయితే కాలం సరిపోవడం లేదు కాబట్టి అయన గురించి మన శతఘ్ని న్యూస్ పేపర్ వారు ఈ సమాచారాన్ని సేకరించి అయన పుట్టినరోజు కానుకగా మేము అందిస్తున్నాం.