పార్టీ ఆదేశిస్తే పార్వతీపురంలో పోటీ చేస్తా..!

  • ఎస్సీ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తా
  • జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు ప్రజల వద్దకు తీసుకు వెళ్తా
  • దోపిడీ, దౌర్జన్యం, అవకతవకలు, అన్యాయాలు, అక్రమ సంపాదన లేని నిజమైన పాలన అందిస్తా
  • జనసేన సీనియర్ నాయకులు ఆదాడ మోహన్ రావు

పార్వతీపురం: పార్టీ ఆదేశిస్తే పార్వతీపురం నియోజకవర్గంలో పోటీ చేస్తానని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహన్ రావు అన్నారు. ఆదివారం పార్వతీపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్వతీపురం మన్యం జిల్లా, నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో తాను ఎస్సీని కావడంతో పార్టీ ఆదేశిస్తే పార్వతీపురం నియోజకవర్గంలో పోటీ చేస్తా అన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గపు పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గంలో పాలన అస్తువ్యస్తంగా ఉందన్నారు. దోపిడీ, దౌర్జన్యాలు, కబ్జాలు, అవకతవకలు, అన్యాయాలు, అక్రమ సంపాదనలు తదితరవి ప్రధాన ధ్యేయంగా పాలన సాగుతుందని ఆరోపించారు. పార్వతీపురం మున్సిపాలిటీలో కనీసం తాగునీరు ఇవ్వలేని పాలన సాగుతోందన్నారు. వాటికి సమాధానం జనసేన పార్టీ పాలనతోనే చెప్పగలమన్నారు. తనకు పార్టీ ఆదేశిస్తే రానున్న 2024లో పార్వతీపురం ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం పార్వతీపురం నుండి తాను పోటీ చేస్తానన్నారు. ఈలోపు పార్వతీపురంలో నివాసం ఏర్పరచుకొని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను, ప్రజల వద్దకు తీసుకు వెళ్లేందుకు అహర్నిశలు శ్రమిస్తానన్నారు. నియోజకవర్గపు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కులమతాలకు అతీతంగా జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తానన్నారు. దోపిడీ, దౌర్జన్యం, కబ్జాలు, అన్యాయం, అక్రమ సంపాదన అవకతవకలు లేని పాలన అందిస్తానన్నారు. ప్రస్తుతం ప్రజలు జనసేన పార్టీని కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను కోరుకుంటున్నారన్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చూస్తే 2024లో జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రజలు నిర్ణయం తీసుకున్నట్లు రూఢీ అవుతుందన్నారు. కాబట్టి పార్వతీపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పార్టీ అభిమానులు, ప్రజలు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పార్వతీపురం నియోజకవర్గంలో తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పార్వతిపురం నాయకులు చందక అనిల్ కుమార్, రెడ్డి కరుణ, గొర్లి చంటి, వంగల దాలి నాయుడు, బంటు శిరీష్, రాజానా రాంబాబు, నేయ్యగాపుల సురేష్, పైలా శ్రీనివాసరావు, రాజాన బాలు, రౌతు బాలాజీ నాయుడు, కాళీ, వీర మహిళలు, మండల అధ్యక్షురాలు ఆగూరుమని, బోనెల గోవిందమ్మ తదితరులు మాట్లాడుతూ జనసేన పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు, జనసైనికులకు ఎటువంటి మచ్చ లేకుండా, చెడ్డపేరు లేకుండా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచే నాయకుడు కావాలన్నారు. అలా ఉంటామంటే తమకు అభ్యంతరం లేదన్నారు. అన్నతరం పార్వతీపురం నియోజకవర్గంలో పార్టీ బలాబలాలు అంచనా వేసి 2024లో గెలిచేందుకు వేసే ఎత్తుగడలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా జనసేన పార్టీ నాయకులు లీగల్ సెల్ అధ్యక్షులు డోల రాజేంద్ర ప్రసాద్, దంతులూరి రామచంద్ర రాజు, పార్టీ సీనియర్ నాయకులు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు) తదితరులు పాల్గొన్నారు.