కాపు ఫెడరేషన్ పేరుతో పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే తగిన బుద్ది చెప్తాం: యన్నం రాము

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కాపు ఫెడరేషన్ పేరుతో చోటా మోటా వీధి నాయకులు విమర్శిస్తే పద్ధతిగా ఉండదని జనసేన పార్టీ సెంట్రల్ జోన్ మెంబర్ యన్నం రాము ఘాటుగా స్పందించారు. రాష్ట్ర బలిజ ఫెడరేషన్ అధ్యక్షుడిగా చలామణి అవుతున్న కునపరెడ్డి శివ శంకర్ రావు, పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలకు స్పందిస్తూ, వీరు ఏనాడు బలిజలకు చేసిందేమీ లేదని, కాపు ఫెడరేషన్ పేర్లతో పబ్బం గడుపుకుంటూ పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు ఎలా చేయాలో వీళ్ళు చెప్తున్నారని, వీరి వల్ల పైసా ఉపయోగం ఉండదని అన్నారు. 2004లో అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చి గెలుపొందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5% కోటాను ఇతరులకు ఇచ్చి, కాపుల రిజర్వేషన్ల ఆశలు సమాధి చేసిన కుటుంబానికి మీరు పాలేరికం చేస్తున్నారని తీవ్రంగా స్పందించారు. పాలేరికం ఎవరైనా చేసుకోవచ్చని దానికి మేము వ్యతిరేకం కాదని, కానీ ఇతరులు పార్టీ ఎలా నడపాలో ఈ పాలేర్లు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వేలకోట్ల ఆస్తులతో, తండ్రి వారసత్వంతో పార్టీ నడుపుతూ, 2019లో అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కాపుల అభివృద్దికి 2000 వేల కోట్లు, అలా 5 సంవత్సరాలలో 10 వేల కోట్లు ఇస్తానని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ గారిని అడిగే దమ్ము ఈ పాలేరులకు లేదని అన్నారు. 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉంటూ సమస్యలపై పోరాడుతూ, తన సొంత డబ్బులను 30 కోట్లు పైనా రైతులకు పంచిన పవన్ కళ్యాణ్ గారిని పార్టీ ఎలా నడపాలో చెప్పే స్థాయి ఈ వీధి పాలేర్లకు లేదని తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత నాయకులలాగ ఒక్కొక్క నియోజకవర్గానికి వందల కోట్లు ఖర్చు పెట్టేంత ఆర్థిక స్థోమత, అక్రమ సంపాదన పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదని, అదే విధంగా రాష్ట్రాన్ని కాపాడాలంటే పొత్తులు తప్పనిసరనీ తెలిపారు. సొంత చెల్లి, తల్లి వదిలేసి, బాబాయిని నరికిన వారికి మద్దతుగా ఉన్న నాయకుడికి పాలేరీకం చేస్తున్న ఈ పాలేర్లు నోరు అదుపులో ఉంచుకోవాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా బడుగు, బలహీన, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల తో పాటు, కాపులు మద్దతు పూర్తి స్థాయిలో ఉందని, రాబోయే ఎలక్షన్లలో కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని తెలిపారు. ఇదే అనుసుగా భవిష్యత్తులో ఎవడైనా కాపు నాయకుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తగిన బుద్ధి చెప్తామని తెలిపారు.