మేకల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

కోదాడ, జనసేన పార్టీ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండల కేంద్రములో ముస్లిం సోదరసోదరీమణులకు శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ పటేల్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం సెక్రటరీ కస్తూరి సురేష్, కోదాడ నియోజకవర్గం ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి మనోజ్ కుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లా విద్యార్థి విభాగం సెక్రటరీ బాదే అంజి, మునగాల మండల అధ్యక్షులు రేపాకుల నరేష్ అంతగిరి మండల అధ్యక్షులు ఇస్లావత్ ఉపేందర్, జానకినగర్ గ్రామశాఖ అధ్యక్షులు షేక్ బాబా మరియు కోదాడ నియోజకవర్గ, చిలుకూరు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.