పచ్చికాపల్లం అభివృద్ధిని విస్మరిస్తారా?: డా. యుగంధర్ పొన్న

పచ్చికాపల్లం పాపం చేసిందా??

నిత్యం రాకపోకలున్నా పట్టించుకోరా??

ఫేమస్ అని పేరు తెచ్చుకున్న పచ్చికాపల్లం అభివృద్ధిని విస్మరిస్తారా??

సిమెంట్ రోడ్డు లేక అవస్థలు పడుతున్న పాలకులు చూసి చూడనట్టు ఉండడం దేనికి సంకేతం

ఆర్ అండ్ బి అధికారులు ఏమి చేస్తున్నారు??

ఓపెన్ ఛాలెంజ్

మీకు సిమెంట్ రోడ్డు వేయడానికి ఒక నెల రోజులు గడువు

వేయక పొతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేస్తాం

జనసేనకు జనం ఆరోగ్యం ముఖ్యం

జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

వెదురుకుప్పం మండలం, పచ్చికాపల్లం లోని రోడ్డును జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పచ్చికాపల్లం నుండి తిరుపతికి, పచ్చికాపల్లం నుండి వెదురుకుప్పం మండలం కేంద్రం మీదుగా చిత్తూరు కి, పచ్చికాపలం నుండి కార్వేటి నగరం మీదుగా పుత్తూరు కి నెలవైన ప్రాంతమని, అట్టి ఈ ప్రాంతంలో సరైన సిమెంటు రోడ్డు వేయకపోవడం చాలా దారుణం అని, రానురాను ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోందని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు, వారపు సంత వ్యాపారులు, నిత్యం ప్రయాణం చేసే వాహనచోదకులు, తమిళనాడు రాష్ట్రం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి కాలినడకన అనేక వేలాది మంది భక్తులు అనారోగ్యం పాలవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతల మయం అయిన రోడ్డుని సాధారణ స్థితికి తీసుకురావడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగిందని గుర్తు చేశారు. పచ్చికాపల్లం ఏమైనా పని చేసిందా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రాకపోకలున్నా, ఫేమస్ అని పేరు తెచ్చుకున్న పచ్చికాపలం అభివృద్ధిని విస్మరిస్తారా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిమెంటు రోడ్డు లేక అవస్థలు పడుతుంటే పాలకులు చూసీచూడనట్టు ఉండటం దేనికి సంకేతమని తెలిపారు. ఈ విషయంలో ఆర్అండ్బీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాలకులకు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నానని తెలుపుతూ ఒక నెలరోజులు గడువు లో సిమెంటు రోడ్డు వేయాలని, వెయ్యకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పచ్చికాపలం ప్రాంతవాసులకు, సుదూర ప్రాంతంలో ప్రయాణం చేసే వాహనచోదకులకు, వ్యాపారస్తులకు మంచి సిమెంటు రోడ్డు నిర్మాణం చేపడతామని, జనసేనకు జనం ముఖ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు.