మండపేటలో జనసేన నేతల అక్రమ అరెస్ట్

మండపేట నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు సంఘీభావం తెలుపుతూ సోమవారం మండపేట పట్టణంలో శాంతియుతంగా బంద్ చేస్తున్న జనసేన శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.