ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సామాజిక న్యాయభేరి యాత్రలు

  • జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు

గుంటూరు, ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సామాజిక న్యాయ భేరి యాత్రలని జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ, ఎస్సి, ఎస్టి మరియు మైనార్టీలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులను సైతం పక్కదారి పట్టిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులకు ఇచ్చేటువంటి నిరుద్యోగ భృతిని కూడా నిలిపివేసిన ఘనత ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానిదని, ఆయన ఏద్దేవా చేశారు.

  • ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీ మహిళలకు పెళ్లిళ్ళకి లక్ష రూపాయలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పెళ్లి అయినా ఒక్క మహిళకైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ఆయన మండిపడ్డారు.
  • మైనార్టీలకు ఇస్లామిక్ బ్యాంకులను ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన అన్నారు.
  • బీసీలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు మంజూరు చెయ్యకుండా,కార్పొరేషన్ల ద్వారా వచ్చే సబ్సిడీ రుణాలను ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నించారు.
    ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీలలో రాజ్యసభకు వెళ్లే మేధావులు లేరా? పక్క రాష్ట్రం నుంచి ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారో,రాష్ట్రంలో ఉన్న బీసీలకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.
  • ఎస్సీ ఎస్టీల నిధులను,కాపు కార్పొరేషన్ కి ఇస్తానన్న సంవత్సరానికి రెండు వేల కోట్లను మీ నవరత్నాల హామీలను నెరవేర్చుకునేందుకు దారి మళ్లిస్తు… దళితులను, కాపులను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
  • బడికి వెళ్ళిన ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇస్తానని చెప్పి, ఇప్పుడు అందులో కూడా ఆంక్షలు ఎందుకు పెట్టారో, ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు. రైతు భరోసా కేంద్రాలకు అద్దె చెల్లించలేని కారణంగా, సొంత పార్టీ నేతలే ఇళ్లకు తాళలు వేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.
  • గుంతల మయం అయిన రోడ్ల పరిస్థితి
  • జాబ్ క్యాలెండర్ పరిస్థితి
  • నిత్యావసర ధరల పెరుగుదల
  • కొత్త పరిశ్రమలు
  • మధ్యపాన నిషేధం
    వీటన్నింటిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలని, లేకుంటే మీరు ఇలాంటి ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించరని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రభుత్వం జనసేన స్థాపించబోతుందని,ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మందపాటి దుర్గారావు, ప్రసాద్, నరసింహారావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.