శ్రీకాళహస్తి జనసేన నాయకుల అక్రమ అరెస్ట్

శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, గ్రామానికి వెళ్ళే దారిని అక్రమంగా మూసివేసి లాంకో/ఈసిఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజలను ఇబ్బంది పెడుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరిగింది. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి బి.ఎన్ కండ్రిగ పోలీసుస్టేషన్ కి తరలించడం అప్రజాస్వామికం. మహిళలను సైతం గాయపరిచేల లాక్కెళ్ళడం హేయమైన చర్య. రోడ్డును మూసివేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు చెప్తుంటే, పోలీసులు ఫ్యాక్టరీ వారికి కొమ్ముకాస్తూ ఆర్ అండ్ బి రోడ్డును మూసివేసిన ఫ్యాక్టరీ వాళ్ళను ఏమాత్రం ప్రశ్నించకుండా ప్రజలను అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టడం తీవ్ర ఆక్షేపనీయం. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారా.? ప్రజల పోరాటాన్ని పోలీసులను అడ్డు పెట్టుకుని ఆపలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.