తెలంగాణా జనసేన విద్యార్థి విభాగ నాయకుల అక్రమ అరెస్టు

  • కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న దందాను సాక్షాధారాలతోని కేసీఆర్ కి అసెంబ్లీ సాక్షిగా ఇవ్వడానికి వెళ్ళిన జనసేన విద్యార్థి విభాగ నాయకులను అసెంబ్లీ దగ్గర అరెస్టు చేసిన పోలీసులు.

ఇంజనీరింగ్ కాలేజీల్లో 30% మేనేజ్మెంట్ సీట్లతో ఏటా దాదాపు 5 వేల కోట్ల వ్యాపారం చేస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షా ఇరవై ఐదువేలు ఉండాల్సిన ఒక్కో సీటుని 15-20 లక్షలు వసూలు చేస్తున్న గీతాంజలి, గోకరాజు గంగరాజు, శ్రీ ఇందు మరియు ఇతర అన్ని కార్పొరేట్ కాలేజీల బండారం పక్కా వీడియో ఆధారాలతో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడానికి వెళ్ళిన జనసేన విద్యార్థి విభాగం నాయకులని అసెంబ్లీ ఆవరణలో ప్రభుత్వం తన పోలీస్ వ్యవస్థతో అక్రమంగా అరెస్ట్ చేసి గోశామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. జనసేన విద్యార్థి విభాగం ఎల్లవేళలా ప్రజల గొంతుకై ఉంటుని మరొకసారి తెలియజేస్తున్నామని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్, ఉపాధ్యక్షుడు గోకుల్ రవీందర్ రెడ్డి, హైదరాబాద్ జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు మహేష్ పెంటల, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్ నాయక్ రంజిత్ రెడ్డి మధు గౌడ్, అజయ్, హరీష్ నాయక్, సురేష్, రాము, విజయ్, క్రాంతి తదితరులు ఉన్నారు.