అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను తక్షణమే విడుదల చేయాలి

నెల్లూరు, అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను తక్షణమే విడుదల చేయాలి అంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో పార్టీ కమిటీ సభ్యులు విలేకరుల సమవేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ…

  • ఈ వైసీపీ ప్రభుత్వం చేతగాని చావలేని ప్రభుత్వం.
  • మూడు రాజధానులు అంటూ చేసిన గర్జన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం.
  • జనసేనాని కి మద్దతు పలుకుతూ వచ్చిన జనసంద్రాన్ని చూసి తట్టుకోలేక సైకోలా ప్రవర్తిస్తున్నారు.
  • అనుమతులు తీసుకుని ఎంతో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీని భగ్నం చేసి మా నాయకుల అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
  • సామాన్యుడికి న్యాయం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతో మొండిగా ఉంటారు మన అందరికీ తెలిసిందే
  • అధికారంలో ఉండే వారు నిరసన తెలియజేయడం శోచనీయం.
  • సామాన్యుడికి అండగా గతంలో మూడుసార్లు జనవాణి నిర్వహించిన అధ్యక్షుడు ఆదివారం వైజాగ్ లో చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి.
  • వైసిపి వారిపై దాడి చేశారంటూ కోడి కత్తి లాంటి డ్రామాలు ఆడుతున్న వైసీపీ ప్రభుత్వానికి నిరూపించే సత్తా లేదు
  • ఈరోజు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 3 రాజధానుల గురించి అమరావతి రాజధాని గురించి వైజాగ్ కి రాలేదు.
  • ఎంతో సమయం పాటిస్తున్న అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహనాన్ని పరీక్షించవద్దు.
  • ఆయన కనుసైగ చేస్తే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుంది.
  • వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి జనసేన నాయకులు బేషరతుగా విడుదల చేసి జనవాణి సజావుగా జరిపించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి షేక్ ఆలియా, పూసల మల్లేశ్వరరావు, జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి వర కుమార్, కమిటీ సభ్యులు హేమచంద్ర, అలేఖ్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.