రామాంజనేయ ప్రసాద్ సంతాప సభకు హాజరైన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏపియుడబ్లూజే జిల్లా మాజీ అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు స్వర్గీయలు క్రీ||శే|| శ్రిష్టి రామాంజనేయ ప్రసాద్ సంతాప సభకు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, మార్కాపురం పట్టణ జనసేన నాయకులు శిరిగిరి శ్రీను, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.