రోడ్లు సమస్యలపైన గలమెత్తున కరిమజ్జి.మల్లీశ్వారరావు

*పవనన్న ప్రజాబాట 83 వరోజు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, రణస్థలం పంచాయతీలో నగరపాలెం నుండి బండిపాలేం వరకు వెల్లి రోడ్లు చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి. ప్రజలకు కావలసిన మౌళిక సదుపాయాలు కల్పించకుండా మాటలు దాటవేస్తు రహదారులు దుస్థితిని పట్టించుకోని ప్రభుత్వం వైఖరిపై జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గురువారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు మరియు జనసేన పార్టీ నాయకులు కృష్ణాపురం పంచాయతీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు రోడ్లు సమస్యలపైన గలమెత్తారు. రోడ్లు సమస్యను శ్రీ పవన్ కళ్యాణ్ దగ్గరకి చేరే విధంగా మరియు ఇప్పుడు ఉన్న వైసిపి ప్రభుత్వం మరియు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాచుట్టు ప్రక్కల గ్రామాలకు ఆరోడ్డు పై ప్రయాణించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు చాలా ఇక్కట్లు పడుతున్నారు.. అలాగే గర్భిణీ స్త్రీలు అక్కడిక్కడే మధ్యలోనే డిలివరీ అయ్యే పరిస్ధితులు ఉన్నాయి. ఈ అన్యాయాన్ని జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది. ఈరోడ్లు సమస్య పై ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేస్తారని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మహాంతి రామస్వామినాయుడు, శనపతి.శంకరరావు, దోండపర్తి.వెంకటేష్, రౌతు.రమణ, పిన్నింటి.గోవిందరావు, పంపురెడ్డి.లక్ష్ము తదితరులు పాల్గొన్నారు.