పాతుకోటలో మన ఊరు మన ఆట సంక్రాంతి

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, హుకుంపేట మండలం, పాతకోట గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సంక్రాంతి-సంబరాలు సందర్భంగా మా ఊరు – మా ఆట అనే కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ హుకుంపేట మండల అధ్యక్షులు బలిజ కోటేశ్వరరావు పడాల్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీ ఘనంగా నిర్వహించడమైనది. గ్రామంలో ఈ కార్యక్రమానికి అశేష ఆదరణ లభించింది. కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు కోటేశ్వరరావు పడాల్ మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి భాద్యత అని, అందులో భాగంగానే మన తెలుగింటి సంక్రాంతి సంబరాలకు మన సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన మన ఆచార వ్యవహారాలు కాపాడుకోవలన్నారు. కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.అరకు నియోజకవర్గ ఇంచార్జ్ చెట్టి చిరంజీవి మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని, మన సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరానికి తెలియపరచడం, నిరంతర జీవనంలో భాగమని దీన్ని ముందుతరాలకు అందించాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఇంతటి ఆవరణ లభించినందుకు గ్రామస్తులకు నిర్వహకులకు క్రృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అథిదులుగా జనసేన పార్టీ అరకు నియోకవర్గం ఇంచార్జ్ చెట్టి చిరంజీవి, ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి కొన్నేడి లక్మ్షణ్ రావు పాల్గొన్నారు.