పాత గోపాలపట్నంలో జనంలోకి జనసేన

విశాఖ పశ్చిమ నియోజకవర్గం, 91వ వార్డ్ పాత గోపాలపట్నంలో జనంలోకి జనసేన అనే కార్యక్రమం పశ్చిమ జనసేన ముఖ్య నాయకులు పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ మొదలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి గడపకి తిరుగుతూ పవన్ కళ్యాణ్ అశయలు ప్రజలకు చేరువ చేస్తూ ప్రతి గడపకి మా నమ్మకం నువ్వే పవన్ అనే స్టికర్ అతికించడం జరిగింది. అనంతరం జనశైనికులు ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీను, సాగర్, కనకరాజు, శంకర్, నాయుడు, సాయి, ప్రకాష్, మెడికల్ షాప్ రాజు, పాత గోపాలపట్నం గ్రామ అధ్యక్షులు రాజు, వీర మహిళలు వాణి, లత, లీల తదితరులు పాల్గొనడం జరిగింది.