వృద్ధమహిళకు అండగా నిలబడదామని పిలుపునిచ్చిన అమర్ కార్తికేయ

కదిరి నియోజకవర్గం, తనకల్లు మండలం, గన్ధోడి వారిపల్లి 1928 వ సంవత్సరంలో పుట్టిన వృద్ధ మహిళ వెంకటమ్మకు గత 2 సంవత్సరాల నుండి పింఛన్ రావడంలేదు. ఫింగర్ రాలేదు అని అప్పుడు పింఛన్ కట్ అయింది, తరువాత ఐరిష్ కూడా రాలేదు, ఇప్పుడు అసలు ఆమెకు బ్లడ్ సర్కులేషన్ కూడా సరిగా అవ్వడంలేదు, మంచానికి పరిమితం అయిపోయింది. ఆధార్ కార్డ్ ఇనాక్టివ్, అది ఆక్టివ్ అవ్వాలంటే తంబ్ ముద్ర వేస్తేనే అవుతుంది. అలాగే రేషన్ కార్డు సమస్య కూడా. మొత్తానికి ఈ అవ్వకు ప్రభుత్వం నుండి పింఛన్ వచ్చే అవకాశం లేదు, దాదాపు 96 సంవత్సరాలు, అసలే ఆరోగ్యం బాగోలేదు, లేచి కూర్చునే అవకాశం కూడా లేదు కేవలం పడుకొనే ఆహారం కూడా తీసుకుంటుంది. కదిరి నియోజకవర్గ నాయకులు ఎవరైనా ముందుకు వచ్చి ఆమెకు నెలకు మీకు తోచినంత పింఛన్ రూపంలో సాయం చేయండి. ఆమె ఇంటి వద్దకు ఎవరు వెళ్లినా.. నాకు పింఛన్ రాలేదు సార్ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఆమె మానసికంగా బాధపడుతూనే ఉంది అని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. ఎవరూ ముందుకు రాకుంటే ప్రతి నెల ఎంతో కొంత ఆమెకు నాకు చేతనైన సాయం జనసేనపార్టీ పేరు మీద అందిస్తానని జనసేన ఎంపిటిసి అమర్ కార్తికేయ తెలిపారు.