గ్రామ సభలో సర్పంచ్ పాల్గొనలేదని స్పందనలో జనసేన పిర్యాదు

నెల్లిమర్ల నియోజకవర్గం: పూసపాటిరేగ మండలం, కోనాడ గ్రామంలో జులై 6వ తేదీన నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్ పాల్గొనలేదని సోమవారం స్పందనలో జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం కార్యదర్శి కారి అప్పలరాజు మండల అభివృద్ధి అధికారి రామారావుకి వినతిపత్రం అందజేశారు. కోనాడ గ్రామంలో గత రెండు గ్రామసభలో సర్పంచ్ పాల్గొనలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.