ఉద్ధానం సమస్యపై లక్ష సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ

ఇచ్ఛాపురం: ఉద్ధాన ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్య పరిష్కారం కొరకు జులై 5వ తేదిన సోంపేటలో ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న లక్ష సంతక సేకరణ కోసం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన ఇంఛార్జి దాసరి రాజు మాలాడుతూ జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్న ప్రధాన 10 అంశాలను అమలుచేయాలని డిమాండ్చేసారు. కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి డోర్ టు డోర్ మూత్రపిండాల ( కిడ్నీ) పరీక్షలు చేయించాలి. ఉద్దానం కిడ్నీ వ్యాధి రోగుల కొరకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్) గుర్తించిన ఉద్దానం కిడ్నీ సమస్య (ఉద్దానం నెఫ్రోపతి) ను పూర్తిగా పరిష్కరించాలి. ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో గల సి.హెచ్.సి లు అయినటువంటి ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, బారువాలలో వెనువెంటనే నెఫ్రాలజిస్టును ఈ ప్రాంతంలో నియమించి కిడ్నీ సంబంధిత నిర్ధారణ పరీక్షలన్నీ కూడా అక్కడే జరిగేటట్టు చూడాలి. కిడ్నీ వ్యాధి ప్రారంభ దశ (1.5 క్రియటినిన్) నాటి నుండి పేషెంట్ యొక్క వైద్యం నిమిత్తం పూర్తి బాధ్యతను మరియు నాణ్యమైన మందులను ప్రభుత్వమే ఉచితంగా అందించాలి. కిడ్నీ పేషెంట్స్ అందరికీ జీవిత బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రకటించి, ప్రభుత్వమే దానిని భరించాలి. ఉద్దాన ప్రాంతంలో ఉన్న రక్త అవసరాలు దృష్ట్యా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో అధునాతన పరికరాలతో కూడిన ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు ను ఏర్పాటు చేయాలి. (బ్లడ్ బ్యాంక్ కు అవసరం అయిన స్థలం జనసైనికులు చే కేటాయించబడును). ఉద్దాన ప్రజలు అందరికీ త్రాగునీటిని అందించే ఉద్దేశ్యంతో ప్రారంభించబడిన వాటర్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలి. క్రియాటినిన్ 5 పాయింట్లు దాటిన ప్రతీ ఒక్క పేషెంట్ కు 5000 రూపాయలు ప్రభుత్వం పెన్షన్ చెల్లించి, నాణ్యమైన మందులు ఇవ్వాలి. కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారం కొరకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఇచ్చాపురం లో ఏర్పాటు చేయాలి. జూలై 5వ తేది నుండి గ్రామాలలో ప్రతీ ఇంటికి వెళ్లి, ప్రజల మద్దతుతో లక్ష సంతక సేకరణ చేసి ఉద్దానంలో కిడ్నీ సమస్య తీవ్రతను తెలిపే సంతకాల ప్రతిని జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. యుక్త వయస్సు నుండి పండు ముసలి వరకు మన ఉద్దానంలో కిడ్నీ సమస్యతో పిట్టల్లా రాలిపోతున్నారు. ఉద్దానం ఊపిరికోసం చేపట్టబోయే ఈ కార్యక్రమంలో ప్రజలు, జనసేన నాయకులు జనసైనికులు, వీరమహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని దాసరి రాజు అన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైపల్లి ఈశ్వర్ రావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్చాపురం మండల అధ్యక్షురాలు శ్రీమతి దుర్గశి నీలవేణి, ఇచ్చాపురం మున్సిపాలిటీ 10వ వార్డు ఇంచార్జ్ రోకళ్ళ భాస్కర రావు, 22వార్డ్ ఇంచార్జ్ దాసరి శేఖర్, ఎంపీటీసీ అభ్యర్థులు సుశీల, కూర్మ రావు, సర్పంచ్ అభ్యర్థి అంగనా సురేష్, వీరమహిళ శైలజ, చందు, జనసైనికులు పాల్గొన్నారు..