దళిత కార్మికుని కుటుంబానికి బత్తుల దంపతులు లక్ష రూపాయల ఆర్థికసాయం

  • మృతి చెందిన దళిత కార్మికుడు భూల రాంబాబు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం.
  • మరో మారు దళిత కుటుంబానికి బాసటగా నిలిచి ధైర్యంగా ఉండమని చెప్పి, జనసేన పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని దళిత బాధిత కుటుంబానికి ‘బత్తుల’ భరోసా
  • ఇదివరకే బాధిత కుటుంబ పక్షాన న్యాయపోరాటం చేసి, ఆరు లక్షల రూపాయలు ఇప్పించి మరో మారు తన ఔదార్యాన్ని చాటుకున్న “బత్తుల” దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం.

రాజానగరం, కోరుకొండ మండలం, కోటికేశవరం గ్రామానికి చెందిన దళిత యువకుడు భూల రాంబాబు కొద్దిరోజుల క్రితం కాంట్రాక్టర్ దగ్గర కూలి పని చేస్తూ మట్టి బెల్లలు విరిగిపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పుడే రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మృతుడి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకపోవడంతో ప్రభుత్వ అధికారులపై, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై, స్థానిక ప్రజాప్రతినిధులపై బాధితుడు కుటుంబానికి న్యాయం జరగాలని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద, రాజనగరం పోలీస్ స్టేషన్ వద్ద మహాధర్నా చేసి ఆ కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు వచ్చేలా చేసి, ఆ కుటుంబానికి న్యాయం చేసిన ఘనత బత్తుల బలరామకృష్ణది. అప్పుడే బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు బుధవారం మరోసారి ఆ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యంగా ఉండమని పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని భరోసా ఇస్తూ జనసేన పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి రాంబాబు భార్యకు, తల్లికి, పిల్లలకు లక్ష రూపాయలు చెక్కును ఆర్థిక సహాయంగా అందించి తన సేవాతత్పరతను, తన ఔదార్యాన్ని మరొమారి చాటుకున్నారు. రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు వెంట పాల్గొన్నారు.