నరవ గ్రామ జనసేన ఆధ్వర్యంలో చలివేంద్ర ప్రారంభోత్సవం

పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామ హైస్కూల్ జంక్షన్ వద్ద వీరమహిళల చేతుల మీదుగా జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో చలివేంద్ర ప్రారంభోత్సవం, జనసేన పార్టీ నాయకులు చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. స్థానిక నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా మార్గంలో భాగంగా ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ పేరు మీద ప్రతి ఏటా హైస్కూల్ జంక్షన్ వద్ద ఎండాకాలంలో ప్రజలకు మంచినీరికి ఇబ్బంది కలగకుండా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు జనసేన పార్టీ భావజాలాలు ప్రజలకు చేరువేలాగా ఏర్పాటు చేస్తామని, ఆర్థికంగా వెనకబాటుతనంలో ఉన్న ఈ ఆంధ్రరాష్ట్రానికి తన సొంత కష్టార్జితాన్ని సమస్యల్లో ఉన్న ప్రజలకు పంచే నాయకుడిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రభుత్వాన్ని స్థాపించాలని ప్రజలు కోరుకుంటున్నారని, తప్పకుండా రాబోయే రోజుల్లో వచ్చేది జనసేన పార్టీ అని మాట్లాడడం జరిగింది. స్థానిక నాయకులు గల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు సేవా మార్గంలో ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, వేసవికాలంలో ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని, తప్పకుండా ప్రతి ఒక్కరు దీని ఉపయోగించుకుంటారని కోరడం జరిగింది, వీరమహిళ పార్వతి మాట్లాడుతూ ఈ యొక్క నరవ గ్రామం జనసేన పార్టీ కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటారని, శ్రీకాంత్ నాయకత్వంలో ఈ ప్రాంతం ప్రజల సమస్యల్ని జనసేన పార్టీ ఎప్పుడు బయటకు తీస్తూ ఉపయోగకరంగా పనిచేస్తున్నారని, వీరి స్ఫూర్తితోనే పెందుర్తిలో ప్రతి దగ్గర ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరడం జరిగింది, సీనియర్ నాయకులు మోటూరు సన్యాసినాడు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో ఈ వేసవి కాలంలో మొట్టమొదటిగా ఈ నరవ గ్రామంలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని మాట్లాడారు, కంచిపాటి మధు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ప్రజలందరూ గమనించి ఈసారి తప్పకుండా పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. వార్డ్ నాయకులు చిన్నా మాట్లాడుతూ ఇదేవిధంగా ప్రజలకు మరిన్ని కార్యక్రమాలు చేయాలని తప్పకుండా అధ్యక్షుడిని ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించేలా మనమందరం కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వబ్బిన జనార్దన్ శ్రీకాంత్, గల్లా శ్రీనివాస్, మోటూరు సన్యాసినాయుడు, పార్వతి, కంచిపాటి మధు, జిత్తడ శ్రీనివాస్, వైకుంఠరావు, మండా సతీష్, బొడ్డు నాయుడు, రాడి పెంటరావు గవర శీను, చిన్నా, అశోక్, ప్రవీణ్, మీనాక్షి, జయ, శివకృష్ణ, లింగం రమేష్, వాసు, చిరంజీవి, మరియు జనసైనికులు పాల్గొన్నారు.