శ్రామిక నగర్ సెంటర్లో ఘనంగా జనసేన పతాక ఆవిష్కరణ

నెల్లూరు నియోజకవర్గం: నెల్లూరు రూరల్ కార్పొరేషన్ డివిజన్ 30 శ్రామిక నగర్ సెంటర్లో జనసేన నాయకులు శీను ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ స్థానిక నాయకులు కృష్ణవేణి మరియు శ్రీను ఆధ్వర్యంలో పార్టీ పతాక ఆవిష్కరణ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేరుకేమో వైఎస్సార్ నగర్, శ్రామిక నగర్ అని పేర్లు గొప్పగా ఉన్నా రోడ్లు, కాలువలు, నీరు అందక స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులకు వీటి గురించి ఎన్నిసార్లు విన్నవించినా కార్పొరేషన్ ఫండ్ లేవంటూ బుకాయిస్తూనే కాలం గడిపేస్తున్నారు. వర్షం వస్తే వీళ్ళ పరిస్థితి వర్ణణాతీతం, ఇంకా తుఫాను బాధితులను ఆదుకున్న పరిస్థితి లేదు. శంకుస్థాపనలో శిలాఫలకాల పేర్లతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోతున్నారే కానీ మౌలిక వసతుల కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కి వైసిపి నాయకులు ముందుకు రావటం లేదు. ఈ ప్రాంతంలో ఇదే ప్రాంతంలో దశాబ్ద కాలం కిందట జెండా స్థాపించినప్పటి నుంచి జనసైనికుడు స్థానిక నాయకులు శీను జనసేన పార్టీతోనే ఉన్నారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచే, నిర్ణయం ఏదైనా కళ్యాణ్ గారి తోనే ప్రయాణం అంటూ నేను జనసేన పార్టీ వదిలే సమస్య లేదు అంటూ ముందుకు సాగుతున్న శ్రీను మన సైనికులకు స్ఫూర్తి. కృష్ణవేణి గారు 2018లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు దాదాపు 400 మంది మహిళలతో స్థానిక సమస్యలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న ఇలాంటి నాయకులకు మద్దతుగా నడిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగకారిగా ఉంటారు. ప్రజలందరూ ఆలోచించి పనిచేయని ప్రభుత్వాన్ని, అభివృద్ధికి నోచుకోని ప్రభుత్వాన్ని తరిమికొట్టి.. ప్రజా ప్రభుత్వ స్థాపిస్తే అభివృద్ది మొట్టమొదట 30వ డివిజన్ నుంచే శ్రీకారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో జనసేన సిటీ కార్యదర్శి కృష్ణవేణి, స్థానిక నాయకులు శ్రీను, ప్రవీణ్, నజీర్, గురవయ్య, రేణుక, హేమచంద్ర యాదవ్, ప్రశాంత్ గౌడ్, మౌనిష్, ఇంతియాజ్, అమీన్, కేశవ తదితరులు పాల్గొన్నారు.