జి.మాడుగుల జనసేన మండల కార్యాలయ ప్రారంభోత్సవం

అల్లూరి సీతారామరాజు జిల్లా, జి.మాడుగుల మండల కేంద్రంలో హట్టహాసంగా జనసేన పార్టీ మండల కార్యాలయం ప్రారంభించిన పాడేరు, అరకు పార్లమెంట్ జనసేన ఇన్ఛార్జ్ డా వంపూరు గంగులయ్య మరియు జి.మాడుగుల మండల నాయకులు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా డా. వంపూరు గంగులయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిస్కారం చెప్పే దిక్చూచిలా ఉండాలని ప్రజలకు ఈ మండల నాయకులు, జనసైనికులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలతో సతమతమవుతున్న గిరిజన ప్రజలకు తోడుగా నిలవాలని తెలిపారు. మండల కేంద్రంలో మనకంటూ ఒక పార్టీ కార్యాలయం ప్రారంభించడం ఎంతో సంతోషించాల్సిన విషయం. ఇకపై ప్రజలకు తమ సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ కార్యోన్ముఖులుగా ఉంటామని అడగగానే కార్యాలయం ఏర్పాటుకు కృషి చేసిన గంగులయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని మండల అధ్యక్షులు తెలిపారు. యూత్ అధ్యక్షుడు మస్తాన్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయం తమకు నైతిక స్తైర్యాన్నిచ్చిందని ఇది జనసైనికుల సమిష్టి విజయమని ఇక క్షేత్రస్థాయి గ్రామ పర్యటన చేసి ప్రజల్లోకి వెళ్లి మార్పు కొరకు జనసేన పార్టీ ఆవిర్భవించిందని, ప్రశ్నించడం మా ప్రథమ హక్కు అని తెలియజేయాలని తెలిపారు. కొర్ర భానుప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ కుటుంబానికి ఒక కార్యాలయం ఏర్పాటు అంటే జి.మాడుగుల మండలం జనసేన వైపే ఉండేలా నా వంతు కృషి చేస్తానని అందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ కార్యాలయం ఏర్పాటుకు కృషి చేసిన జి.మాడుగుల మండల నాయకులను డా. గంగులయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మండల నాయకులు మండల అధ్యక్షులు మసాడి భీమన్న, ప్రధాన కార్యదర్శి గొంది మురళి, ఉపాధ్యక్షులు ఈశ్వరరావు, యూత్ అధ్యక్షులు షేక్ మస్తాన్, కార్యనిర్వాహక అధ్యక్షులు మసాడి సింహాచలం, గౌరవ అధ్యక్షులు టీ.వీ రమణ, కొర్రభానుప్రసాద్, సోమన్న, నాగేశ్వరరావు, త్రీమూర్తులు, కృష్ణ, రాజు పాడేరు మండల నాయకులు, అశోక్, సంతోష్, చింతపల్లి మండల నాయకులు వాడకాని వినయ్, పునీత్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.