నూజివీడులో ఘనంగా జనసేన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం

నూజివీడు నియోజకవర్గం: నూజివీడులో జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ కార్యాలయాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషం కలిగించిందని హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా బర్మా ఫణి బాబుకి మరియు నూజివీడు నియోజకవర్గం కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, ఉమ్మడి కృష్ణాజిల్లా నాయకులు, కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


,