గంగారపు స్వాతి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

మదనపల్లి, జనసేన పార్టీ 11 వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా గురువారం మదనపల్లి నియోజకవర్గంలో కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గంగారపు స్వాతి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరామహిళలతో కలసి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు స్వాతి మాట్లాడుతూ జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర భవిష్యత్తు కొరకు పార్టీని స్థాపించి ఎన్నో సమస్యలపై పోరాటం చేసారని ప్రజల శ్రేయస్సు కొరకు టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకొని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆయన అడుగు జాడల్లో మేము నడుస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర,జిల్లా జాయింట్ సెక్రటరీలు సనా ఉల్లా, గజ్జల రెడ్డెప్ప, రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర, రాజారెడ్డి, రూరల్ ఉపాధ్యక్షులు కుమార్, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, పట్టణ ప్రధాన కార్యదర్శి వరికోళ్ల నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి జవిలి మోహన కృష్ణ, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, పట్టణ ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, పట్టణ సెక్రటరీ మేకలచెర్వు అర్జున, గంగులప్ప, లవన్న, వీర మహిళలు పట్టణ సెక్రటరీ నాగవేణి, పట్టణ సెక్రటరీ పద్మావతి, విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ మారప్ప నాయక్, నారాయణ స్వామి, జెస్వంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.