గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటినగరం మండలంలో వైసిపి అక్రమాలకు ఎదురొడ్డి పోరాడుతున్న ధీరుడు వైసీపీ నాయకుల అక్రమ కేసులకు సమాధానంగా హైకోర్టు ద్వారా స్టే తీసుకుని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన మా నాయకుడు మా అన్న నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ను శాలువాతో సత్కరించి నియోజకవర్గ నాయకులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న నాయకులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజల పక్షాన జనసేన పార్టీ కార్యక్రమాలు, పోరాటాలు ఉదృతం చేసి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేద్దామని ఈ సందర్భంగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసేంత వరకు అవిశ్రాంత కృషితో ముందుకు వెళ్లాలని, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో ప్రజల గొంతును వినిపించాలి అని తెలియజేశారు. నియోజకవర్గ నాయకులందరూ ఇంచార్జి యుగంధర్ మాటకు కట్టుబడి నియోజకవర్గంలోని నాయకులు అందరు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, మండల బూత్ కన్వీనర్ అన్నమలై, ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.