రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం పరితపించి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆశయాలను నెరవేర్చడానికి తమ వంతు కృషి చేస్తామని రాబోవు ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆ పార్టీ యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన పార్టీ నాయకులు కత్తి సుబ్బరాయుడు, శ్రీనివాసులు, వీరయ్య ఆచారి, వెంకటయ్య, చౌడయ్య, గోవర్ధన్, వినయ్, జనసేన వీరమహిళలు మాధవి, లక్ష్మమ్మ పాల్గొన్నారు.