శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పెరిగిన వరద

నిజామాబాద్‌: ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తున్నది. దీంతో ప్రాజెక్టులోకి 20,402 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిన నీటిమట్టం 1091 అడుగుకాగా, ప్రస్తుతం 1072.20 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు. జలాశయంలో ప్రస్తుతం 33.550 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.