45+ వారికి నేటి నుంచి వ్యాక్సినేషన్

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా వారియర్స్ కు, 60 ఏళ్ళు పైబడిన వారికి, 45 సంవత్సరాలు దాటి సివియర్ వ్యాధులు ఉన్న వారికి కరోనా వ్యాక్సిన్ ను అందించారు. కాగా, ఈరోజు నుంచి దేశంలో 45 ఏళ్ళు దాటిన అందరికి వ్యాక్సిన్ ను అందించబోతున్నారు. తెలంగాణలో మొత్తం 80 లక్షల మంది 45 ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీరికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇక ఏపీలోని అర్బన్ ప్రాంతాల్లో కరోనా టీకా పంపిణి చేయనున్నారు. పట్టణాల్లోని పీ.హెచ్.సిలో, వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సినేషన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు గుంటూరులో ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా టీకా వేయించుకోబోతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద స్థాయిలో కేసులు పెరుగుతుండటంతో 45 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.