పట్టణ శివారు కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: జనసేన డిమాండ్

ఎమ్మిగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ రేఖ గౌడ్ ఆదేశాల మేరకు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు పట్టణంలోని సోమప్ప నగర్, ఎల్లమ్మ బీడు, కాలనీలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, లు మాట్లాడుతూ పట్టణ శివారు కాలనీల్లో చాలా కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నా.. ఎలాంటి అభివృద్ధికి నోచుకొక పోవడం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మునిసిపల్ అధికారులకు కనపడడం లేదా అని వారు మండిపడ్డారు. ఇంటి పన్ను, నీటి పన్ను వసూలు చేస్తూ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శివారు కాలనీల్లో ఉన్న సమస్యలపై దిష్టి సారించి పరిష్కారం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరణం రవి, షబ్బీర్, రషీద్, బాలు, మోహన్, కాళిదాసు, రాము, తదితరులు పాల్గొన్నారు.