వై.సీ.పి నిరసనలకు బదులుగా కిర్లంపూడిలో జనసేన నిరసన

  • పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం, జగన్ ఫోటో దగ్గం

జగ్గంపేట నియోజకవర్గం: కిర్లంపూడి సెంటర్ లో బుధవారం వై.సీ.పి ప్రభుత్వ నాయకుల నిరసనలకు బదులుగా కిర్లంపూడి సెంటర్ లో జనసైనికుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేసి జగన్ ఫోటోను దగ్ధం చేసి, ప్రభుత్వ మద్దతిదారుల నిరసనలకి జనసేన జగ్గంపేట నియోజకవర్గ శ్రేణులు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలంటీర్లంతా ఒకసారి వై.సీ.పీ. నాయకులు జారీ చేసే ఆర్డర్లు పక్కన బెట్టి జనసేన అధినేత ఏం మాట్లాడారో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. యువతని వాలంటీర్ పేరుతో వారి భవిష్యత్తుని, అభివృధ్ధిని అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకుల మాటలు నమ్మొద్దన్నారు. సొంత జేబులో డబ్బులు ప్రజలకి దానంచేసే పవన్ కళ్యాణ్ ఎక్కడా??.. ప్రజాధనంతో తన సొంత సాక్షీ పేపర్ కొనిపించే ఈ వై.సీ.పి ముఖ్యమంత్రి ఎక్కడ?? అని హేళన చేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు పాలిశెట్టి సతీష్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, తామరాడ ఎంపీటీసీ గోకాడ రాజా, మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గంధం ప్రభాకర్, పార్టీ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, మండల అధికార ప్రతినిధి పాతిరెడ్డి శేఖర్, ఎలుబండి శివ, సాయి మండల మరియు గ్రామ జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.