బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: రాష్ట్రవ్యాప్తంగా గత 3 రోజుల నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ.. చేపట్టిన నిరసన కార్యక్రమాలను ఖండిస్తూ.. శుక్రవారం ఉదయం బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో బ్రహ్మసముద్రం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, వాలంటీర్లు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ఖండిస్తూ.. వాలంటీర్లను, వైసిపి నాయకులను హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ సెక్రటరీ లక్ష్మీనరసయ్య మరియు జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ హాజరయ్యారు. అదేవిధంగా బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, బ్రహ్మసముద్రం మండల ప్రధాన కార్యదర్శులు రాయుడు, వీరమహిళ షేక్ తార, జాకీర్, ముక్కన్న, జయకృష్ణ, వేపులపర్తి విశ్వనాథ్, శివ, రమేష్, వెంకటేష్, తిప్పేరుద్ర, గోవిందు, ధనుంజయ, గిరీష్, రాజేష్, ఎర్రిస్వామి, నరేష్, బొంబాయి ఎర్రిస్వామి, శివరుద్ర, నితిన్, శాంతికుమార్, గోపీచంద్, మాలింగ, జానీ ఎర్రిస్వామి, మహేష్, రాము, విజయ్, చైతన్య, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.