అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు

*మడకశిర నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు

*అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు

*ఈ సందర్భంగా వై.బి. హళ్ళి పంచాయతీలో 30 యువకులు జనసేన పార్టీలో చేరిక

శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మడకశిర జనసేన అధ్యక్షుడు శివాజీ ఆధ్వర్యంలో.. జనసైనికుల సమక్షంలో.. పార్టీ కార్యకర్తల ప్రోద్బలంతో.. అభిమానుల ప్రోత్సాహంతో.. ప్రజలందరి మధ్య పర్యావరణ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వై.బి. హళ్ళి పంచాయతీలో 30 యువకులు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. పర్యవరణ పరిరక్షీణించడం అనేది జనసేన పార్టీలో ఒక సిద్ధాంతం.. రేపటి వాతావరణం భావితరాలకు భవిష్యత్ ఇచ్చేది. ప్రకృతి పరమైన బాధ్యతని నమ్మే సిద్ధాంతం.. పర్యావరణాన్ని పరిరక్షించి మరియు అభివృద్ధి చెయడం. ఈ సిద్ధాంతాన్ని పాటించే విధంగా ఈ రోజు మొక్కలునాటడం జరిగింది.. అనంతరం కేక్ కట్ చేసి ఆనందాల ఉత్సవంతో సంబరాలు జరుపుకోవడం జరిగింది. తదనంతరం జనసేన పార్టీ కర్తవ్యం విధి నిర్వహణ బాధ్యతగా పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాలలో ప్రజా సమస్యలపై విజృంభించి.. వీది.. వీదులలో ఊరేగింపుగా రోడ్ల వెంబడి తిరుగుతూ.. పాదయాత్రగా ప్రతి ఇంటింటికి చేరి ప్రజలతో మమేకమై చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న రోడ్ల సమస్య గురించి.. డ్రైనేజీ సమస్య.. పేదరిక సమస్య.. నిరుద్యోగ సమస్య.. ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలియజేసి.. గ్రామ ప్రజలందరికీ పర్యావరణ పరిరక్షణ గురించి వివరించడం జరిగింది. తదనంతరం శివాజీ మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని, పదవులు పొందడానికి, అధికార దాహానికి, ప్రజల సొమ్ము దోచుకోవడానికి అవకాశం లేకుండా స్వచ్ఛంగా నిజాయితీగా ప్రజల సొమ్మును ప్రజల అభివృద్ధికి ఖర్చు పెట్టడానికి.. ప్రజా సంక్షేమానికి.. సమాజ అభివృద్ధికి.. దేశ పురోభివృద్ధికి కృషి చేయడానికి మా జనసేన పార్టీ దోహదం చేస్తుందని.. అందుకే మా జనసేన పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపిస్తే.. ప్రజా సమస్యల పరిష్కారానికి మీ వెంటే ఉంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకశిరమండల అధ్యక్షుడు టి.ఏ శివాజీ, ఐటీ విభాగం కోఆర్డినేటర్ టి. ప్రసాద్, ఉపాధ్యక్షులు యశ్వంత్, ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్, శ్రీహరి, శ్రీనివాసులు రంగనాథ్, కార్యదర్శులు, నాగభూషణం, పవన్ కళ్యాణ్, శశిప్రీతమ్. సంయుక్త కార్యదర్శులు. పవన్ కుమార్. రాజు. రఘు. నరేష్. నాగార్జున. హ వైబి హళ్ళిపంచాయతీ జనసైనికులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.