పవన్ అన్న జన్మదిన వేడుకలకు ఆహ్వానం

కొర్రా రమేష్ ఆధ్వర్యంలో అనంతగిరి మండలంలో సెప్టెంబర్ 2వ తేదీన ఘనంగా నిర్వహించనున్న పవన్ జన్మదిన వేడుకలకు ఇదే మా ఆహ్వానమని, జరగబోయే పవన్ అన్న జన్మదిన వేడుకలకు అందరూ హాజరు కావాలని కోరుతున్నామని అనంతగిరి మండల జనసేన పార్టీ నాయకులన్నారు. ఈ సందర్భంగా కొర్రా రమేష్ మాట్లాడుతూ.. అల్లూరీసీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలంలో సెప్టెంబర్ 2వ తేదీన జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 53వ జన్మదిన వేడుకల సందర్బంగా అరకు నియోజకవర్గంలో నాయకులకు వీరమహిళలు, జనసైనికులకు, అభిమానులకు ఆహ్వాన పత్రికలు అందచేస్తున్నాము. అదే విదంగా ఆరోజు క్రియాశీలక జనసైనికుడు కొర్ర రమేష్ మరియు ముఖ్యనాయకుల ఆధ్వర్యంలో బొర్ర గుహలులో సుమారు 1500 మంది ప్రజలకు అన్నసంతర్పణ చేయబడును. వృద్ధులకు రగ్గులు పంపిణీ చేయాలని నిర్ణయించడమైనది. సేవాభావంతో సమాజహితం కోరే ప్రతి జనసైనికుడు తమ వంతు విధిగా పవన్ అన్న జన్మదిన వేడుకలకు హాజరై తమవంతు సేవతత్పరతను సాటి చెప్పాలని, ఈ కార్యక్రమంలో మీ బాగస్వామ్యమే మా కృషికి పరమార్థమని, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని అందుకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించదలిచామని అనంతగిరి మండల జనసేనపార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ మురళి, కొర్రా ప్రవీణ్, శెట్టి చిన్న, మైలు, త్రినాధ్, జనసైనికులు మోటర్ ఫీల్డ్ యూనియన్ ప్రెసిడెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.