ఆంజనేయ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి: తిరుపతి అనూష

  • రెడ్డి అంటే కాపాడేవారని అర్థం. ఆడపిల్లకి అన్యాయం చేసిన వ్యక్తిని వెనకేసుకొస్తూ రెడ్ల పరువు తీయమాకండి
  • కాపాడే వారా.. లేకపోతే కాటేసే వాడికి అండగా నిలబడతారా సమాధానం చెప్పాలి?
  • 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష

విజయవాడ: కార్పొరేటర్ స్థానంలో ఉండి ఎంతోమంది ఆడపిల్లలకి అన్యాయం చేసిన కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష డిమాండ్ చేసారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వెల్లంపల్లి భజన రెడ్డి సంఘం అని పెట్టుకోండి, ఆంజనేయ రెడ్డి భజన రెడ్డి సంఘం అని పెట్టుకోండి, ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వ్యక్తిని వెనకేసుకురావడానికి రెడ్డి సంఘం పేరు పెట్టుకోమాకండి, రెడ్లు పరువు తీయమాకండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే వాళ్ల పక్కన నిలబడకుండా ఒక కీచకుడి వెనుక మీరు నిలబడి మద్దతు పలుకుతున్నారంటే మీకు మనస్సాక్షి ఉందా..? గురువు స్థానంలో ఉండి, అదేవిధంగా ఒక కార్పొరేటర్ స్థానంలో ఉండి ఎంతోమంది ఆడపిల్లలకి అన్యాయం చేసిన కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే కొంతమందివెదవలు మాట్లాడతా ఉన్నారు.. మాకు దమ్ముంటే ఆ అమ్మాయిని ప్రెస్ ముందుకు తీసుకురండి, ప్రెస్ ముందు మాట్లాడించండి అని శపదాలు చేస్తున్నారు. మీకులాగా మనస్సాక్షి లేని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో లేము మేము.. విలువలతో కూడిన పార్టీ జనసేన పార్టీలో ఉన్నాము. ఆ ఆడపిల్ల కుటుంబం ఎంత మానసిక ఆందోళనకు గురై ఉంటుందో మాకు తెలుసు… మీ ఆంజనేయ రెడ్డికి సపోర్ట్ చేసే ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తున్న మీ ఆంజనేయ రెడ్డి 45 రోజుల ఫోన్ డేటా బహిరంగపరచండి మేము చేసిన ఆరోపణ తప్పు అని మీరు నిరూపిస్తే నేను బహిరంగంగా ఆంజనేయ రెడ్డి గారికి క్షమాపణ చెప్తా.. అంతేగాని ఆ కుటుంబాన్ని బహిరంగపరచాల్సిన అవసరం మాకు లేదు. ఊర్మిళ నగర్ లో వెల్లంపల్లి డ్రైవరు రెడ్డి సామజిక వర్గం ఆడపిల్లల్ని అసభ్య పదజాలంతో దూషించినప్పుడు ఈ రెడ్డి సంఘం ఎక్కడికెళ్ళింది. కరుడుగట్టిన వైఎస్ఆర్సిపి కార్యకర్త కూతుళ్ళని ఇదే వెల్లంపల్లి శీను డ్రైవరు వాళ్ళ అనుచరులు అసభ్య పదజాలంతో దూషించినప్పుడు ఈ రెడ్డి సంఘం ఎక్కడ ఉంది..? ఆడపిల్లలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడలేని కొంతమంది.. రెడ్డి సంఘం అని పేరు పెట్టుకుని తప్పు చేసిన వాళ్ళకి మద్దతు పలుకుతున్నారంటే మీ కన్నా పనికిమాలినోళ్లు ఎవరైనా ఉంటారా అని నేను ప్రశ్నిస్తున్నా? మీలాంటి వాళ్ళకి త్వరలోనే ఈ ఆడవాళ్ళందరూ తగిన గుణపాఠం చెప్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. రెడ్డి అంటే కాపాడేవారని అర్థం. అంతేగాని రెడ్డి సామాజిక వర్గంలోని మహిళల్ని లోబర్చుకున్న వ్యక్తికి అండగా మీరు నిలబడ్డారంటే మీరు కాపాడే వారా.. లేకపోతే కాటేసే వాడికి అండగా నిలబడతారా సమాధానం చెప్పాలి? అంటూ అనూష ఘాటుగా ప్రశ్నించారు.