ప్రారంభం కానున్న ఐపీఎల్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌ ఇక ప్రారంభం కానుంది.

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ముందుగా నిర్నయిన్చినట్లే ఈ మెగా లీగ్‌ జరుగుతుందని ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ అధికారికంగా ప్రకటించారు. యూఏఈలోని షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదికలుగా ఈ మ్యాచ్‌లు 51 రోజుల పాటు జరుగుతాయని ప్రకటించారు. అయితే… విదేశాలలో జరిగే ఈ టోర్నీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని టోర్నీకి గ్రీన్‌సిగ్నల్‌ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. సెప్టెంబరు 15 కు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ కూడా ముగియనుండడంతో ఆ దేశ ఆటగాళ్ల అందుబాటును దృష్టిలో ఉంచుకుని మరుసటి కౌన్సిల్‌ సమావేశంలో తుది షెడ్యూల్‌ను నిర్ణయిస్తారని తెలిపారు. ప్రస్తుత ప్రరిస్థితుల దృష్ట్యా యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని పటేల్‌ తెలిపారు.

అయితే ఈ ఐపిఎల్ లో ప్రత్యేకత ఏమిటంటే… మ్యాచ్లకు వ్యాఖ్యాతలు వ్యవరించేవారందరూ ‘వర్క్‌ ఫ్రం హోం’ చేయనున్నారు. ఇప్పటికే దీనిపీ స్టార్‌స్పోర్ట్స్‌ ట్రయల్‌ కూడా చేసి సౌతాఫ్రికాలో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌కు బరోడా నుంచి ఇర్ఫాన్‌ పఠాన్‌, కోల్‌కతా నుంచి దీప్‌దాస్‌ గుప్తా, ముంబై నుంచి సంజయ్‌ మంజ్రేకర్‌ తమ నివాసాలలో ఉండే కామెంట్రీ అందించారు.