హెటిరో డ్రగ్స్‌ ఆఫీసులపై ఐటీశాఖ దాడులు

 నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (IT) దాడులు చేపట్టింది. బుధవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. హెటిరో డ్రగ్స్‌ కార్పొరేట్‌ కార్యాలయం, ప్రొడక్షన్‌ కేంద్రాలు, హెటిరో డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో 20 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌తో పాటు మరో మూడు ప్రదేశాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.