జనసేన జెండాను ఆవిష్కరించిన వరికూటి నాగరాజు

మార్కాపురం నియోజకవర్గం: పొదిలి పట్టణంలోని రాంనగర్ శ్రీ రామ యోగి స్వామి తిరునాళ్ల సందర్భంగా రామ్ నగర్ కాలనీలో జనసేన పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. తదుపరి జనసేన పార్టీ అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుత్ ప్రభ దగ్గరికి వెళ్లి వరికూటి నాగరాజు జనసైనికులను ఉద్దేశించి మన పార్టీ యొక్క సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాల గురించి మాట్లాడారు మరియు రానున్న ఎన్నికలలో మన జనసేన, టిడిపి కూటమికి మద్దతు తెలిపి గెలిపించవలసిందిగా కోరారు. అలాగే మన కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజారంజక పాలన ఉంటుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు మేలు కలిగే విధంగా ఉంటుందని ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి చేస్తామని మాట్లాడారు. అనంతరం రామ్ నగర్ లోని 50 కుటుంబాలను పార్టీ కండువా వేసి వరికూటి నాగరాజు పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసైనికులు, కార్యకర్తలు, నాయకులు మరియు తిరుణాలకు విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు.