జగన్ కి సరైన మొగుడు కావాలంట – బాబు పాలూరు

బొబ్బిలి, జగన్ కి సరైన మొగుడు కావాలంట అందుకే మాట్లాడితే సభా సంస్కారం లేకుండా పెళ్లిళ్లు, పెళ్లాలు అంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురుంచి మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి, మీకు అంత ఉబలాటంగా ఉంటే, మా సొంత ఖర్చులతో మీకు స్వయంవరం నిర్వహిస్తాం. మా జనసైనికులలో సరైనోడిని ఎంచుకుని మొగుడిగా చేసుకోండి. రాష్ట్రాన్ని దోచుకుంటూ, ప్రజల భవిష్యత్తును అధోగతి పాలు చేస్తున్న నీకు, జనం తరపున పోరాటం చేస్తున్న నిజాయితీ పరుడైన మా పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉచ్ఛరించే నైతిక అర్హత కూడా లేదని జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు అన్నారు.